ఏపీలో అనంతపురం జిల్లాలో ఎక్కువగా నమోదైన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 69 కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 82 మంది
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 510
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 69 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 82 మంది కరోనా నుంచి కోలుకోగా... ఒక్క మరణం కూడా సంభవించలేదు. 

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 23,19,012కి చేరుకుంది. ఇప్పటి వరకు 23,03,772 మంది కరోనా నుంచి కోలుకోగా... మొత్తం 14,730 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 510 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,32,91,315 శాంపిల్స్ ని పరీక్షించారు. 


Andhra Pradesh
Corona Virus
Updates

More Telugu News